బేగంపేట్, మే 15: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే మహోన్నతమైన సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ సనత్‌నగర్ టిమ్స్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రారంభించనున్న ఈ టిమ్స్ ఆస్పత్రిని శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సందర్శించారు. కేటీఆర్ వెంట మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, బీఆర్ఎస్ నేతలు అత్తెల్లి శ్రీనివాస్‌గౌడ్, రాజు, నర్సింగరావు తదితరులు ఉన్నారు.