మేడ్చల్, ఏప్రిల్12(నమస్తే తెలంగాణ): ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా ఆదివారం మల్కాజిగిరిలో నిర్వహించే సన్నాహక సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మల్కాజిగిరిలో భారీ ర్యాలీ అనంతరం లక్ష్మీసాయి గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు సభ ఉంటుందన్నారు.