KTR | దుర్గం చెరువు దుస్థితిపై కేటీఆర్ ఫైర్.. ఫ్యూచర్ సిటీ అంటూ ప్రజెంట్ సిటీని గాలికొదిలేశారని ధ్వజం
KTR | హైదరాబాద్లోని దుర్గం చెరువు చెత్త కుప్పగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో బిజీగా ఉన్న ప్రభుత్వం ప్రస్తుత హైదరాబాద్ను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
KTR | హైదరాబాద్ బ్రాండ్గా నిలిచిన దుర్గం చెరువు పరిస్థితి అధ్వానంగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ బిజీగా ఉందని.. ప్రస్తుత సిటీని కాలుష్యం, ఇతర సమస్యల నుంచి కాపాడటంపై దృష్టి పెట్టేందుకు సమయం లేదని ఎద్దేవా చేశారు. ప్రజెంట్ సిటీ ఇప్పుడు సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉందని తెలిపారు.
దుర్గం చెరువు ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వీడియోను ‘ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా’ ఎక్స్ ఖాతా ద్వారా చేసిన పోస్టును కేటీఆర్ షేర్ చేశారు. చెరువు నీటి ఉపరితలంపై భారీగా చెత్త పేరుకుపోయిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. చెరువు పరిసరాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయినట్లు పోస్టులో పేర్కొన్నారు.
Congress Govt is busy building the imaginary “Future City”
No time for Present City – it’s under 22A https://t.co/hrceXiX8Uz
— KTR (@KTRBRS) September 5, 2026
ఈ దృశ్యాలను ప్రస్తావిస్తూ కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఊహాజనిత ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో బిజీగా ఉంది. ‘ప్రజెంట్ సిటీ’కి మాత్రం సమయం లేదు.. అది 22ఏ కింద ఉంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

