సిటీబ్యూరో, నవంబర్ 2, (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమరంలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్‌ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి సోమవారం సాయంత్రం బోరబండ డివిజన్లో రోడ్ షో నిర్వహించనున్నారు. డివిజన్లోని వీకర్ సెక్షన్ హైటెక్ హోటల్ నుంచి బోరబండ బస్టాప్ వద్దకు రోడ్ షో చేపట్టి ప్రసంగించనున్నారు.