KTR | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. కరంచంద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఇచ్చిన మాట నిలబె ట్టుకున్నారు.
మొయినాబాద్, జూలై 13 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఇచ్చిన మాట నిలబె ట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు డప్పు కరంచంద్ రోడ్డు ప్రమాదంలో గత 20 రోజుల క్రితం మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ మీ కుటుంబానికి మేమున్నామని మనోధైర్యం చెప్పి భరోసా కల్పించారు. భవిష్యత్తులో పిల్లలు ఉన్నత చదువులు చదువుకునే విధంగా వారి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చాడు. కరంచంద్ కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం జులై 4వ తేదీన తన ముగ్గురు పిల్లల పేరు మీద రెండు లక్షల చొప్పున ఆరు లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు.
పిల్లల పేరు మీద చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి గ్రామంలో కరంచంద్ కుటుంబ సభ్యులను కలిసి అందజేశారు. దీందతో కరంచంద్ భార్య, పిల్లలు ఫోన్ ద్వారా కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకటరెడ్డి రూ. 20 వేలు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు కోట్ల నరోత్తం రెడ్డి రూ.25 వేలు కరంచందు కుటుంబానికి అందించాటు.అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరంచంద్ బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నాయకుడిగా కొనసాగుతూ సోషల్ మీడియా వారియర్ గా పనిచేసేవాడని తెలిపారు. బీఆఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా ఆపదలో ఉంటే పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జి దేశమొల్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు కొత్త నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరి యాదవ్, మాజీ ఎంపిటిసి మాణిక్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి,సీనియర్ నాయకులు జయవంత్, రవి యాదవ్, సురేందర్ గౌడ్,కుమ్మరి రాము, మాజీ ఉప సర్పంచ్, షాబాద్ శ్యామ్ రావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, యువత మండల మాజీ అధ్యక్షుడు పరమేష్, చదువు రామచందర్, షాబాద్ ప్రవీణ్, దామోదర్ రెడ్డి, గునుగుర్తి దర్శన్, కుమ్మరి, శ్రీనివాస్, మోత్కుపల్లి కిరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

