బంజారాహిల్స్,నవంబర్ 15: అధికార దుర్వినియోగంతో పాటు అనేక రకాలైన అరాచకాలు చేయడం ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిందని, బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైన మాగంటి సునీతాగోపీనాథ్‌తో పాటు కుటుంబసభ్యులను శనివారం మాదాపూర్‌లోని వారి నివాసంలో కేటీఆర్ కలిశారు.
ఓటమికి కుంగిపోవాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ కార్యకర్తలు నేతల పోరాటపటిమతో సుమారు 74వేల ఓట్లు సాధించారని గుర్తుచేశారు. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రెండుమూడు రోజుల్లో కార్యకర్తల సమావేశంలో ఉప ఎన్నికలో ఓటమిపై సమీక్ష నిర్వహించుకుని భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.