కేటీఆర్ సిట్ విచారణ అడుగడుగునా ఆంక్షల మధ్య కొనసాగింది. సిట్ దర్యాప్తునకు ఉదయం 11గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోగా బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలిరాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36కు వచ్చే అన్ని దారులను దిగ్బంధం చేశారు. పీఎస్‌కు సుమారు 100 మీటర్ల దూరంలోనే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. మహిళా నేతలు, కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పీఎస్ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. చట్నీస్ చౌరస్తావైపు నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పోలీస్‌స్టేషన్ వైపు రావడానికి ప్రయత్నించగా తోపులాట జరిగింది.
సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పీఎస్ సమీపంలోకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా గొడవ జరిగింది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్‌రాజ్ యాదవ్ జూబ్లీహిల్స్ పీఎస్ సమీపంలోని హోటల్లో ఉండి విచారణ తీరును తెలుసుకున్నారు. న్యాయవాదులు పీఎస్ పక్కనున్న రెస్టారెంట్లోకి వెళ్లేందుకు రాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ముఠా జయసింహ తన ఇంటి వద్ద నుంచి నాయకులతో కలిసి బయలు దేరగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్/ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23: తమ అభిమాన నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అకారణంగా విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడాన్ని ఖండించడంతో పాటు ఆయనకు మద్దతుగా జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, అభిమానులను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సుమారు ఏడున్నర గంటలపాటు విచారించారు.

ఉదయం 9.30కి నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి మాజీ మంత్రి హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రాతో సహా పలువురు ఎమ్మెల్యేలు , బీఆర్ఎస్ నేతలు వచ్చారు. వారితో సమావేశమైన అనంతరం హరీష్‌రావుతో కలిసి కేటీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడినుంచి ఉదయం 11గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు కేటీఆర్ చేరుకున్నారు. కాగా కేటీఆర్‌కు సంఘీభావంగా వందలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకుని అక్కడినుంచి ఆయన వెంట బయలుదేరేందుకు ప్రయత్నించారు. అయితే పెద్దసంఖ్యలో మొహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

జూబ్లీహిల్స్ పీఎస్‌లో సిట్ విచారణ కోసం కేటీఆర్ రావడానికి ముందుగానే వందలాదిమంది పోలీసులతో జూబ్లీహిల్స్ రోడ్ నెం 36కు వచ్చే అన్ని దారులను దిగ్బంధనం చేశారు. పీఎస్‌కు సుమారు 100మీటర్ల దూరంలోనే పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. మాజీమంత్రి హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు పీఎస్ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా చట్నీస్ చౌరస్తా వైపు నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ వైపు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి తోపులాట చోటు చేసుకుంది.

దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, కేపీ.వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్‌రాజ్ యాదవ్ తదితరులు జూబ్లీహిల్స్ పీఎస్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోసారి బీఆర్ఎససససససస్ మహిళా నాయకులు, కార్యకర్తలు పీఎస్ వద్దకు రాగా పోలీసులు వారిని అరెస్టుచేసి తరలించారు. రోజంతా బీఆర్ఎస్ శ్రేణుల పోలీసుల నిర్భంధాన్ని ఎదుర్కొన్నారు. సాయంత్రం 6.35 గంటల ప్రాంతంలో విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్‌కు బయలుదేరగా.. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా తరలివెళ్లారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను శుక్రవారం సిట్ విచారించనున్న నేపథ్యంలో ఉదయం నుంచి బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఓయూ హాస్టళ్లలో చొరబడి నిద్రిస్తున్న విద్యార్థి నేతలను బలవంతంగా అరెస్టు చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తం 8 మంది విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రానికి వారిని వదిలిపెట్టారు.