సిటీ బ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్ని పారిశ్రామిక వాడలను సందర్శించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ సీనియర్ నాయకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాలను నియమించారు. వారంతా నేడు, రేపు పారిశ్రామిక వాడల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. ఈ మేరకు పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించారు.

క్లస్టర్ల వారీగా పర్యటనలు