బేగంపేట్, అక్టోబర్ 26: ప్రజలందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పద్మారావునగర్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగ మూడో వార్షికోత్సవానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఒక్క సనత్‌నగర్ నియోజక్కవర్గంలోనే కాదు హైదరాబాద్‌లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా తలసాని అండగా ఉంటారని కొనియాడారు. మంచిరోజులు రావాలంటే జూబ్లీహిల్స్‌లో ఉన్న తమ బంధువులు, మిత్రులతో బీఆర్ఎస్కే ఓటు వేయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, సామలహేమ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.