KTR | దాదాపు ఆరున్నర, 7 లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్ధానాలు ఇచ్చింది. 100 రోజుల్లోనే 6 వేల పెన్షన్ అని చెప్పింది. రూ.6 వేల పెన్షన్ ఇంకా ఎందుకివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేటీఆర్ దివ్యాంగులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీనిచ్చింది. బ్యాక్ లాగ్ పోస్టుల విషయంలో, చదువుల విషయంలో కానీ చాలా చాలా వాగ్ధానాలు వారి అభయహస్తం మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో, వారి మనసుల్లో ముద్రించుకొని పోయి ఉన్నయి. తెల్లారి లేస్తే శారీరకంగా అవస్థలు పడే దివ్యాంగులు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏం లేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు ఇవాళ అసెంబ్లీలోకి రావాలని ప్రయత్నం చేశారు. నేనడిగాను అసెంబ్లీలో లోపలికి రానీయండి.. మా లెసిస్లేచర్ పార్టీ ఆఫీస్లో కలుద్దాం. వారు బయట రోడ్డు మీద కలవటం కరెక్టు కాదు. కానీ వీళ్లంతా వస్తే మాకేదో ఇబ్బంది అయితది. వాళ్లను వద్దు అని చెప్పి పాసులు కూడా ఇయ్యకుండా సతాయిస్తే వారిని నడిరోడ్డుమీద కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని కేటీఆర్ మండిపడ్డారు.
దివ్యాంగుల గురించి కళ్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేం ఈ బడ్జెట్ సెషన్లో అడుగుతాం.. నిలదీస్తాం. రూ.6 వేల పెన్షన్ ఇంకా ఎందుకివ్వడం లేదు. పక్క రాష్ట్రంలో రూ.6 వేల పెన్సన్ ఇస్తున్నరు. మీరు గద్దెనెక్కిన తర్వాత మూడో బడ్జెట్ ఇది 60 శాతం సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించడం లేదు. నిలదీస్తాం. దీంతోపాటు దివ్యాంగులకు గతంలో మేం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినం. ప్రతీ దాంట్లో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. భవిష్యత్లో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగ సోదరసోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ హెచ్చరించారు.
రేపు ఇందిరాపార్క్ దగ్గర వాళ్లు రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు దానికి కూడా మా మద్దతు ఉంటుంది. పార్టీ నాయకులం కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా దివ్యాంగ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు 100 రోజుల్లో రూ.6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది
దివ్యాంగులు మమ్మల్ని కలవడానికి అసెంబ్లీకి వస్తే లోపలికి రానివ్వలేదు, వారిని రోడ్డు మీద కలవాల్సి వచ్చింది
పక్క రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం 6వేల… pic.twitter.com/koEnkLx6FE
— Telugu Scribe (@TeluguScribe) March 24, 2026