హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని( Ranjith Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళమ్మ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. విషయం తెలుసుకున్న కేటీఆర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు. చంద్రకళమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి పరమపదించడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేసిన కేటీఆర్ pic.twitter.com/zl3JtiMhAm
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026