హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సరారు ఘోర తప్పిదం వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి మరణించిన ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల హైదరాబాద్‌లో నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను మూడురోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా అసమర్థతత, చేతకానితనం, పరిపాలన వైఫ ల్యం ఇంకోటి ఉంటదా? కనీసం తమ ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోలేని ఆ బాధిత కుటుంబాల ఆవేదన, గుండెకోత, మానవత్వం లేని కాంగ్రెస్‌కు వినిపించడం లేదా? అని మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లుతున్న నాలాలు ప్రజల ప్రాణాలు హరిస్తుంటే మున్సిపల్ మంత్రిగా కూడా ఉండి సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నట్టు? అని నిలదీశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను నిర్వీర్యం చేయడంతోనే దుస్థితి తలెత్తిందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరుగురిని సజీవ సమాధి చేసి ఇప్పటికే మహాపాపం మూటగట్టుకున్నారని, నాలాల్లో బలిచేసిన ముగ్గురి మృతదేహాలను కూడా గుర్తించకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదనారు.