హైదరాబాద్: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) దారుణం చోటుచేసుకున్నది. అప్పుల బాధతో చనిపోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. భర్త చనిపోగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.
రమ్యకృష్ణ, రామకృష్ణ దంపతులు కేపీహెచ్బీ కాలనీలో నివసిస్తున్నారు. అప్పులు అధికమవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మొదట భర్త రామకృష్ణ గొంతు కోసిన రమ్యకృష్ణ.. అనంతరం తానూ గొంతు కోసుకున్నది. రామకృష్ణ చనిపోగా, భార్య రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నది. గుర్తించిన స్థానికులు ఆమెను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.