KPHB Colony | కేపీహెచ్బీ కాలనీ : దేశంలో గత పదేండ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించి పట్టం కట్టారని ఆ పార్టీ కూకట్పల్లి ఇన్చార్జీ మాధవరం కాంతారావు అన్నారు. శనివారం బీజేపీ బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షుడు జీ వినోద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఢిల్లీ బిజెపి గెలుపు సంబరాలలో ఆయన పాల్గొన్నారు. స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ఢిల్లీలో ప్రజలు అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపి, సమర్థ పాలన కోసం బీజేపీని గెలిపించారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అవినీతి, అసమర్ధ పాలనతో ప్రజలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు సాగనంపడం ఖాయమని అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగరడం తధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు భగవంత్ రెడ్డి ,సోమశేఖర్ రెడ్డి, సత్యనారాయణ, అనిల్, కోటేశ్వరరావు, రాము, బాల నారాయణ, సంతోష్, సూరిబాబు, ప్రేమ్ కుమార్, అర్జున్, లహరి తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్గా ఎస్. రాజశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ ఎస్హెచ్ఓగా పని చేసిన వెంకటేశ్వరరావు సైబరాబాద్ సీటీసీకి బదిలీపై వెళ్లారు. గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న ఎస్ రాజశేఖర్ రెడ్డిని కేపీహెచ్బీ కాలనీ ఎస్హెచ్ఓ గా నియమిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా… శనివారం పోలీస్ స్టేషన్లో రాజశేఖర్ రెడ్డి ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.