యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి కొండపైన కేవలం స్వామి వారి దర్శనానికి మాత్రమే అనుమతినిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట కింద, ఘాట్ రోడ్డు మార్గం, కొండపై లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం, ఆటో స్టాండ్ ల వద్ద గల గోడలపై సూచికలు రాయించారు.
ఆలయ పునర్ని ర్మాణం పనులు జరుగుత్నున నేపథ్యంలో భక్తులకు కేవలం స్వామి వారి దర్శనాలు మాత్రమే కల్పిస్తున్నట్లు, ఇతర సౌకర్యాలు కల్పించలేక పోవుచున్నందుకు చింతిస్తున్నాం. భక్తులు సహకరించాలని విజ్ఞప్తిలో పేర్కొన్నారు. దీంతో పాటు దేవాలయ మైకుల్లో సైతం ఆలయ అధికారులు ప్రకటనలు వినింపించారు.