మహేశ్వరం, ఏప్రిల్ 16 : మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా రూపాంతరం చెందుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, రఘుపతి, నర్సింహ్మ, సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగుతున్నదని ఆన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. బీజేపీ నాయకులు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు నందిగామ బాలయ్య, చేపంగి మల్లేశ్, దన్నారం రాజు, తాళ్లపల్లి రవీందర్, అనిల్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, కృష్ణ, ఆవుల ప్రశాంత్, సీహెచ్ శ్రీకాంత్, గుడిసె రవి, తాళ్లపల్లి రాజు, రమేశ్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, మనీశ్ ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఆవుల మల్లేశ్, ఉపాధ్యక్షుడు బండ రమేశ్, 7వ వార్డు సభ్యుడు బాబు యాదవ్, ఎస్సీసెల్ ప్రెసిడెంట్ కాడిగళ్ల శేఖర్, క్రాంతి చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
యువత చూపు బీఆర్ఎస్ వైపు
యువత చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నదని, వివిధ పార్టీలకు చెందిన యువకులు అధికసంఖ్యలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నారని ప్రభుత్వవిప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువకులు దాదాపు 100 మంది స్థానిక నాయకులు శ్రీనివాస్ చౌదరి అధ్వర్యంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస్ రావు సమక్షంలో వివేకానందనగర్ కాలనీలోని ప్రభుత్వవిప్ అరెకపూడి గాంధీ నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గాంధీ యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ మియాపూర్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ ఆయ్యాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పల కాపాడుకుంటుందని, వారికి అన్ని వేళల అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాదవరం రంగారావు, వివేకానందనగర్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కరరావు, చంద్రకాంత్‌రావు, కట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ముఖ్యనాయకులు లోకేష్ కుమార్, కిరణ్, సంతోష్, వెంకట్, వంశీకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.