సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ): భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీ విద్యార్థికి రూ.63 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో 750 కంపెనీలు పాల్గొని 6,200 ఉద్యోగావకాశాలకు ఆఫర్ ఇవ్వగా, అందులో 5000 మంది విద్యార్థులు ఉద్యోగార్హత సాధించారు. 2023లో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో కనిష్ట వార్షిక వేతనం రూ.8.2 లక్షల నుంచి ప్రారంభం కాగా, అత్యధికంగా రూ.63 లక్షల వార్షిక వేతనంతో యూనివర్సిటీ విద్యార్థి యుగాబైట్లో ఉద్యోగం పొందారు.
క్యాంపస్ ప్లేస్మెంట్లో అమెజాన్, అల్టాసియన్, లైట్ బీమ్ వంటి కంపెనీలు రూ.30 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగావకాశాన్ని కల్పించాయని తెలిపారు. కేఐఐటీ వర్సిటీని 1997 నుంచి ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ అచ్యుత సమంతా ఉన్నత విద్యా ప్రమాణాలతో నిర్వహిస్తున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్‌లో 16వ స్థానం దేశ స్థాయిలో వచ్చిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ కేఐఐటీ వర్సిటీకి మంచి గుర్తింపు ఉందన్నారు.