Khairatabad Ganesh | హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి.. గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. సరిగ్గా శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు గణనాథుడిని నిమజ్జనం చేశారు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు. 11 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న మహా గణపతి నిమజ్జన ప్రక్రియను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులుతీరారు. దీంతో నగర నడిబొడ్డున సాగర ప్రాంతం జన సందోహంగా మారింది. మహా గణపతి శోభాయాత్ర కూడా ఘనంగా కొనసాగింది.
ఉదయం 8 : శోభాయాత్ర ప్రారంభం
ఉదయం 10 : రాజ్‌దూత్ సర్కిల్‌కు చేరిన శోభాయాత్ర
ఉదయం 10.45 : టెలిఫోన్ భవన్‌కు చేరిన మహా గణపతి
ఉదయం 11 : తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద కన్నుల పండువగా సాగిన శోభాయాత్ర
ఉదయం 11.20 : తెలంగాణ సచివాలయం ముందుకు చేరిన గణనాథుడు
ఉదయం 11.40 : ఎన్టీఆర్ గార్డెన్స్ వద్దకు చేరిన శోభాయాత్ర
ఉదయం 11.45 : బాహుబలి క్రేన్ వద్దకు చేరిన గణనాథుడు
మధ్యాహ్నం 12.05 : మహా గణపతికి మహా హారతి
మధ్యాహ్నం 1.30 : హుస్సేన్ సాగర్‌లో గణనాథుడి నిమజ్జనం
మధ్యాహ్నం 1.45 : మహా గణపతి నిమజ్జనం ముగింపు