బంజారాహిల్స్, జూన్ 27: బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు గుణపాఠం నేర్పేందుకు ప్రజలంతా సిద్ధ్దంగా ఉన్నారని నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన పలువురు యువకులు శుక్రవారం మన్నె గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువనేతలు నవీన్, నితిన్, సిద్దూ, సాయితో పాటు సుమారు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదవుల కోసం ఊసరవెల్లిలా పార్టీలు మారుతున్న దానం నాగేందర్‌కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో షాక్ ఇచ్చేందుకు ఓటర్లను సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, గత ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను నిలిపివేసి పేదలకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను జనం అసహించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, విప్లవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.