Ketireddy Vasudevareddy : ఎన్నికల హామీల్లో ఒకటైన ఉద్యోగాల భర్తీపై మాట దాటేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసేందుకు.. జూలై 18న నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సదస్సు’ను విజయవంతం చేయాలని నిరుద్యోగులకు రాష్ట్ర కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువతతో సమావేశమైన ఆయన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీల గురించి కేతిరెడ్డి వివరించారు.
నాడు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసిందని రాష్ట్ర కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ధ్వజమెత్తారు. నాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి.. బస్సు యాత్రలు చేపట్టి, రెండు ఉద్యోగాలు ఊడ కొడితే ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పి నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకున్నారని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాహుల్ గాంధీకి పార్లమెంట్లో ఒక ఉద్యోగం, ప్రియాంక గాంధీకి పార్లమెంటు సభ్యురాలుగా రెండో ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల చెందిన ఒక్కో కుటుంబంలో రెండు ఉద్యోగాలు మాత్రం వచ్చాయని కేతిరెడ్డి వెల్లడించారు. అంతేతప్ప ఒక్క నిరుద్యోగ యువతకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగం రాలేకపోవడం దురదృష్టకరమని ఆయన వాపోయారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతపై ముఖ్యమంత్రి చేసిన అహంకారపు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కేతిరెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల నాడు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల రూపాయలు, ఒక సంవత్సరం – రెండు లక్షల ఉద్యోగాలు అంటూ అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సరూర్గర్ జూలై 18నలో జరగబోయే యువ సంగ్రమ సదస్సుకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు కేతిరెడ్డి.