Mandakrishna | అల్లాపూర్, ఫిబ్రవరి26 :మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగకు దేశ అత్యున్నత పద్మశ్రీ పురస్కారం వరించిన నేపథ్యంలో మోతీ నగర్‌కు చెందిన విద్యుత్ శాఖ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ సామాజికవేత్త అశ్విన్ కుమార్‌తో కలిసి బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మందకృష్ణను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అశ్విన్ తండ్రి అరుంధతీయ బంధు సేవా మండలి వ్యవస్థాపకుడు దివంగత సర్వేష్ మాదిగ రిజర్వేషన్ పోరాటం మొదలు పెట్టిన తొలినాళ్లలో తన వెన్నుతట్టి ఎంతగానో ప్రోత్సహించాడని మంద కృష్ణ మాదిగ గుర్తు చేసుకున్నట్లు వారు తెలిపారు.