సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తేతెలంగాణ) : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురువారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాగంటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వీణా-వాణీలతో మాగంటి జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అనాథ పిల్లలు, వీణా-వాణీతో కలిసి తన బర్త్డే వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్యరావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, వేణు, విజయ్, జీటీఎస్ టెంపుల్ చైర్మన్ చిన్న రమేశ్, గజ్జల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.