జూబ్లీహిల్స్,సెప్టెంబర్30 : జూబ్లీహిల్స్ తుది ఓటరు జాబితాను మంగళవారం యూసుఫ్‌గూడలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, 19 వ సర్కిల్ డీసీ జీ.రజనీకాంత్ రెడ్డి విడుదల చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏఈఆర్ఓలు ఏసీపీ ప్రసీద, ఏఎంసీలు కమల్, బాల్‌రాజ్, తహశీల్దార్ ప్రేమ్ కుమార్‌తో కలిసి స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా సిద్దం చేసిన ఫొటో ఓటరు జాబితాను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పి.వినోద్ కుమార్, బీజేపీ నుంచి సుప్రియ గౌడ్, సీపీఎం నుంచి టి.శేశగిరిరావు, ఎంఐఎం నుంచి నసీర్, టీడీపీ నుంచి ఎన్.బాల్‌రాజ్, కాంగ్రెస్ నుంచి జి.దేవేందర్, బీఎస్పీ నుంచి ఎ.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.