Jubilee Hills by Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వర్గమంతా ప్రచారంలో మునిగి తేలుతుంది. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున ప్రచారం సాగిస్తున్నారు. అయితే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై ప్రజలు మంత్రులను నిలదీస్తున్నారు. పెన్షన్లు ఎక్కడ..? తులం బంగారం ఏమైంది..? ఉచిత కరెంట్ ఎక్కడ..? అని నిలదీస్తుంటే మంత్రులు నీళ్లు నములుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పలేక.. తడబడుతూ సంబంధం లేని సమాధానాలు ఇస్తూ మంత్రులు దాట వేస్తున్నారు.
తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓ వృద్ధురాలిని జూపల్లి కృష్ణారావు అభ్యర్థించగా.. ఆమె షాకిచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నల వర్షం కురిపించింది.
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టు రూ. 4 వేల పెన్షన్ ఎక్కడని, ఉచిత కరెంట్ లేదని, కరెంట్ బిల్లు జారీ చేస్తున్నారని మంత్రిని వృద్ధురాలు నిలదీసింది. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అంటూ జూపల్లి కృష్ణారావును నిలదీసింది వృద్ధురాలు. ఇక ఏదో సమాధానం చెప్పేందుకు జూపల్లి యత్నించినప్పటికీ ఆ వృద్ధురాలు అసహనం వ్యక్తం చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావును, నవీన్ యాదవ్‌ను నిలదీసిన వృద్ధురాలు
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టు 4 వేల పెన్షన్ ఎక్కడని, కరెంట్ బిల్లు కూడా వస్తుందని మంత్రిని నిలదీసిన వృద్ధురాలు
ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ… pic.twitter.com/ALOqc4Eqw1
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2025