Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పలుచోట్ల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. షేక్‌పేట్ డైమండ్‌హిల్స్ కాలనీలోని అల్ఫాల్హా స్కూల్ బూత్‌లో రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వెళ్లి పరిశీలించారు. వేరే ప్రాంతాల నుంచి బురఖాలో మహిళలను తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నట్లుగా గుర్తించారు.
డైమండ్‌హిల్స్ పోలింగ్ బూత్‌ల్లో కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్‌కు దిగుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఓటర్ ఐడీ కార్డు లేకుండానే బురఖాలో వచ్చిన వారిని లోపలికి పంపించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐడీ కార్డు లేకుండానే పోలింగ్ బూత్‌లోకి ఎలా పంపిస్తారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం, పోలీసులు కలిసిపోయి కాంగ్రెస్‌ను గెలిపిస్తారా అని నిలదీశారు. బోగస్ ఓటింగ్‌కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలేనా అని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా ఎన్నికలు నిర్వహిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఉప ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణలోని జూబ్లీహిల్స్లోనే అత్యల్ప ఓటింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అత్యల్పంగా 31.94 శాతం పోలింగ్ నమోదైంది. ఇక పంజాబ్‌లో 36.62 శాతం, జమ్ముకశ్మీర్‌లో 42.07 శాతం, జార్ఖండ్‌లో 54.08 శాతం, మిజోరంలో 56.35 శాతం, ఒడిశాలో 51.42 శాతం, రాజస్థాన్‌లో 47.77 శాతం పోలింగ్ నమోదైంది.
Jubilee Hills By Election
పోలింగ్ రోజున బయటపడిన ‘ఓటు చోరీ’ బాగోతం
ఒక మహిళ ఓటు వేయడానికి వెళ్లగా.. అప్పటికే ఆమె పేరుపై ఓటు వేసినట్లు తెలిపిన అధికారులు
నిజమైన ఓటరుని తాను ఉండగా.. తన పేరుపై వేరే వాళ్లు ఎలా ఓటు వేస్తారంటూ మహిళ నిలదీత
ఇదెలా సాధ్యం అవుతుంది..? ఒక వ్యక్తి ఓటుని… pic.twitter.com/IIWE17hHhB
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 11, 2025