కందుకూరు, జూన్ 20 : బీఆర్ఎస్సర్కారులోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు పేర్కొన్నారు. ఇందుకు ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ కార్యక్రమం మరింత దోహపడిందని, దీంతో సర్కారు బడులకు మహర్దశ పట్టినట్లయిందని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా విద్యా దినోత్సవంలో పాల్గొని మంగళవారం కందుకూరు గురుకుల (బాలకల) పాఠశాలలో వివిధ రంగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యలో సమూల మార్పులు తీసుకొవచ్చినట్లు తెలిపారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ పాఠశాలల్లో చదువకుంటున్న విద్యార్థులు రెండు జతల బట్టలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, రాగి సంకటి, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మన ఊరు-మన బడిని ప్రవేశపెట్టి ఈ విద్య సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంతాప్రభాకర్రెడ్డి, సర్పంచ్ శమంతకమణి, వార్డు సభ్యులు తాళ్ల కార్తీక్, పూజిత ప్రశాంత్‌చారి, దేశం మోహన్‌రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్‌రెడ్డి, బీసీసెల్ కార్యదర్శి కాసోజు ప్రశాంత్‌చారి, పాఠశాలల ప్రధానోపాధ్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్ డివిజన్న్లోని వీఎం హోం పాఠశాలలో విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రభుదాస్ మాట్లాడుతూ.. తమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందిస్తుడటంతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, లైబ్రరీ ఇన్చార్జి భాస్కర్ శ్రీనివాస్, ఉపాధ్యయులు పాల్గొన్నారు.
విద్యాదినోత్సవం సందర్భంగా మహేశ్వరం బాలుర పాటశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, బట్టలను పంపిణీ చేసి, డిజిటల్ క్లాసులను ఎంపీటీసీ సుదర్శన్ యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరోళ్ల చంద్రయ్యముదిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాటశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందించే విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యారంగాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని తెలిపారు. మనఊరు- మన బడి ద్వారా విద్యారంగంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అంగూర్ నాయక్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహేశ్వరం, జూన్ 20: కులం పేరుతో దూషించిన పోరండ్ల సర్పంచ్ మచ్చ శకుంతల రెడ్డిని సర్పంచ్ పదివినుంచి తొలంగించాలని కోరుతూ.. గ్రామ ఉపసర్పంచ్ మల్లేశ్ గ్రామస్తులతో కలిసి మంగళవారం అదనపు కలెక్టర్ తిరుమల రావుకు వినతిపత్రాన్ని అందజేశారు. పోరండ్ల గ్రామంలో దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మల్లేశ్ హనుమాన్ దేవాలయంలోకి ప్రవేశించగా.. అక్కడే ఉన్న సర్పంచ్ మచ్చ శకుంతల రెడ్డి, ఆమె భర్త మచ్చ మహేందర్‌రెడ్డి మల్లేశ్‌ను కులం పేరుతో దూషిస్తూ.. ఆలయం భయటకు వెళ్లాలని గొడవ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీపీఎం మండల కార్యదర్శి అలువాల రవికుమార్, ఉపసర్పంచ్ మల్లేశ్, జగన్, కార్తీక్, రమేశ్, అశోక్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.