కేపీహెచ్‌బీ కాలనీ, మే 10: ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) అమరులైన జవాన్లకు కూకట్పల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్‌లోని గాంధీ విగ్రహ వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుడైన మురళి నాయక్‌కు, వీర సైనికులకు నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికుల సేవలు త్యాగాలు గొప్పవన్నారు. సైనికుల పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు.
పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారత దేశం విజయం సాధించాలని, దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్నారు. ప్రజలంతా సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నేతలు విద్యా వెంకట్, తోట్ల పరమేష్, ఆర్కే దయాసాగర్, నిమ్మల శ్రీనివాస్, గడ్డమీది బాలరాజు, మొగుళ్ల మాణిక్య రెడ్డి, కోహిర్ నాగరాజు,రాహుల్, ప్రవీణ్, జయకుమార్, సాగర్ రెడ్డి, రాము, నవీన్ గౌడ్, రమేష్, రాకేష్, రాజు, నరసింహారావు, వెంకటేష్, రామారావు, హరికృష్ణ, మారుతి సాగర్ పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.