శామీర్‌పేట, నవంబర్ 7: బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం తూంకుంట మున్సిపాలిటీ ఉప్పర్‌పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పొలమొల్ల లక్ష్మీనారాయణతో పాటు 10 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి బీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పర్‌పల్లి మాజీ సర్పంచ్ రవీందర్, బీఆర్ఎస్ నాయకులు అశోక్, వెంకటేశ్, బాలు పాల్గొన్నారు.
కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట
బోడుప్పల్: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కులవృత్తులకు పూర్వవైభం వచ్చిందని రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ చామకూర ప్రీతిరెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డిలు అన్నారు. మంగళవారం 5వ డివిజన్‌తో పాటు స్థానిక వేద కన్వెన్షన్ హాల్లో కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నాయీ బ్రాహ్మ ణ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు బీసీబంధు ద్వారా వృత్తి పరికరాలను అం దించిదని పేర్కొన్నారు. పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయీ బ్రాహ్మణలు ప్రీతిరెడ్డి సంమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికి పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పద్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, నాయకులు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.
అభివృద్ధి చూసి గెలిపించండి
మేడ్చల్:అభివృద్ధి చూసి బీఆర్ఎస్ను గెలిపించాలని మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహారెడ్డి, మంత్రి మల్లారెడ్డి కోడలు శాలినీ రెడ్డి ఓటర్లను కోరారు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి మద్దతుగా మేడ్చల్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
మంత్రి గెలుపునకు కృషి చేయాలి
కీసర: మంత్రి మల్లారెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు అహర్నిశలు కృషి చేయాలని ఎంపీపీ మల్లారపు ఇందిరలక్ష్మీనారాయణ సూచించారు. మంగళవారం కీసర మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నేతలు కలిసి మంత్రి మల్లారెడ్డి గెలుపుకు మద్దతుగా ఇంటింటికీ ప్రచారం చేశారు.
పీర్జాదిగూడలో..
పీర్జాదిగూడ: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరిగిందని కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతి రి హరిశంకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలో నాయకులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.