చిక్కడపల్లి, జూన్ 24: ఈవీ బస్సులతో టీజీఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకాలేదని.. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 8వ మహాసభ జరిగింది. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ తిరుపతయ్య, ఈ నిరంజన్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ఎండీ సజ్జనార్, ప్రభుత్వ చీఫ్‌విప్ వీ ఐలయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీలోకి నూతనంగా 2,800 ఈవీ బస్సులను తీసుకువస్తున్నామని తద్వారా నగరంలో కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ, ఏరియర్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లు కే రమేష్, రేణుక, నాయకులు.. చారి, దుర్గయ్య, స్వరూప, కృష్ణ, భూషణ్, స్వామి, మంగమ్మ, శ్రీనివాస్, పద్మ, నాగేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.