హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ పరిధిలో శనివారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. శనివారం నాడు హుజూరాబాద్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్టీయూ యూనివర్సిటీ వెల్లడించింది. బీటెక్, బీఫార్మా, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు 1 నుంచి జరగాల్సిన పరీక్షలు మాత్రం యధాతథంగా జరుగుతాయని తెలిపింది.