ఉప్పల్, అక్టోబర్ 16: ఉప్పల్ కాంగ్రెస్‌పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు, దిష్టిబొమ్మ దహనాలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీ పీసీసీ మాజీ సెక్రటరీ పుడూరి జితేందర్‌రెడ్డితో సహ 200 మంది కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్‌లో సోమవారం రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉప్పల్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిపై అక్రమాలు, కేసులను వివరిస్తామన్నారు. కాంగ్రెస్‌పార్టీకి ఎన్నో ఏండ్లుగా సేవలు అందిస్తున్నా సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని విమర్శించిన వ్యక్తిని పార్టీలోకి తీసుకువచ్చి పీసీసీ అధ్యక్షుడిని చేశారన్నారు.
పార్టీ కోసం కష్టపడినవారిని కాకుండా తనకు జిందాబాద్‌లు కొట్టేవారికే, బౌన్సర్లుగా పనిచేసే నేతలకే పార్టీలో గుర్తింపు, పదవులు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హోల్‌సేల్‌గా పార్టీని కొని, రిటైల్‌గా విక్రయిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పార్టీని ప్రవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల పార్టీ టెకెట్లను అంగడి సరుకుగా మార్చేశారని తెలిపారు. వేలంపాటగా మార్చి, డబ్బులకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీని ముంచేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీని నాశనం చేసే పనిలో పడ్డారని తెలిపారు. సొంతపార్టీ నాయకుల మీదనే దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి వేధించే కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని కచ్చితంగా ఓడిస్తామన్నారు. అనంతరం ఉప్పల్‌లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.