ఇంటింటికి తిరిగి.. అనువణువూ పరిశీలించి
మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఆదివారం జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల ఈ బస్తీ ప్రజలు అనార్యోగానికి గురైన నేపథ్యంలో ఎండీ దానకిశోర్ ఇంటింటికీ వెళ్లి ప్రజల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు
బేగంపేటలోని వడ్డెరబస్తీలో జలమండలి ఎండీ దాన కిశోర్ పర్యటన
నీటి నాణ్యతను గుర్తించి.. నల్లాకు ట్యాప్‌లు బిగించిన అధికారులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ )/మాదాపూర్ : మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఆదివారం జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల ఈ బస్తీ ప్రజలు అనార్యోగానికి గురైన నేపథ్యంలో ఎండీ దానకిశోర్ ఇంటింటికీ వెళ్లి ప్రజల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పర్యటించి డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ వ్యవస్థను పరిశీలించారు. కాలనీ ప్రజలతో కలిసి మంచినీటి పైపులైన్, డ్రైనేజీ ఒకేచోట ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. లీకేజీలు ఉన్నాయా.! పరిశీలించారు. అనుమానం ఉన్న చోట మరమ్మతు పనులు చేపట్టారు. ఎయిర్‌టెక్ మిషన్ సహాయంతో డ్రైనేజీ పైపులైన్‌ను శుభ్రం చేయించారు. బస్తీలో సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఈ సందర్భంగా ఎండీ ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నీటి నాణ్యతను పరీక్షించాలని సూచించారు.
అన్ని నల్లా కనెక్షన్లకు ట్యాప్‌ల బిగింపు..
గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో 69 నల్లా కనెక్షన్లకు ట్యాప్‌లు (నల్లాలు) లేవని జలమండలి అధికారులు గుర్తించారు. సగానికి పైగా నల్లా గుంతలు మరుడుదొడ్ల పక్కనే ఉన్నట్లు అధికారుల పర్యటనలో బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే వడ్డెర బస్తీలో అన్ని నల్లా కనెక్షన్లకు ట్యాప్‌లను బిగించారు. ఈ కార్యక్రమంలో ఈడీ సత్యనారాయణలతో పాటు జనరల్ మేనేజర్ రాజశేఖర్, డీజీఎం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి బ్యాక్టీరియా లేదు..
వడ్డేర బస్తీలోని వేర్వేరు ఇండ్లనుంచి సేకరించిన నీటి నమూనాలను క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ ల్యాబరేటరీ కి పంపించామని.. పరీక్షల్లో అన్ని నమూనాల్లో తగిన మోతాదులోనే 0.5పీపీఎం రెసిడుయల్ క్లోరిన్ ఉందని తేలిందని జలమండలి అధికారులు తెలిపారు. నీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందని, ఈ నీరు తాగేందుకు సురక్షితమైనదిగా పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

