చిక్కడపల్లి, నవంబర్ 1: చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సమీపంలో టీ స్టాల్ వద్ద నిరుద్యోగ జేఏసీ నేతలు నిరుద్యోగుల బాకీ కార్డును శనివారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో టీ తాగిన చోటే నిరసనగా తాము బాకీ కార్డును విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల కోసం మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడగొడుతామని హెచ్చరించారు. నిరుద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, వెంకటేశ్, సింధూరెడ్డి, శ్రీనివాస్, రమేశ్, బాలకోటి, కుమార్, రవి కుమార్,మధు, గణేశ్, ఆకాశ్, భాస్కర్ పాల్గొన్నారు.