మలక్‌పేట, మార్చి 25: వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రా నాయక్, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కుమార్, నిరుద్యోగుల సంఘం నాయకులు సోమేశ్ జాదవ్, నరేందర్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యకుమార్, ఇంద్రా నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక పత్రాలను అందజేసి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. నిండు అసెంబ్లీలో చెప్పటం సిగ్గుచేటని, రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా అబద్ధాలు చెప్పుకొంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.కాగా, పోలీసులు ధర్నా చేస్తున్న భూక్యా కుమార్, ఇంద్రానాయక్, సోమేశ్ జాదవ్, నరేందర్‌ను అరెస్ట్‌చేసి మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.