Anjaiah Yadav | బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే సిద్దాపూర్ శివారులో ఐటీ కారిడార్ కు అడుగులు పడేవని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొత్తూరు మండలం సిద్దాపూర్ శివారులో టీజీఐఐసీ తన పరిధిలోని 86 ఎకరాల భూమిని ఏకో టౌన్షిప్ ఏర్పాటు కోసం జీహెచ్ఎంసికి బదిలీ చేస్తూ ఇటీవల జీవో 641 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సిద్దాపూర్ గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. పారిశ్రామిక అవసరాల కోసం నాటి బీఆర్ఎస్ సర్కారు సిద్ధాపూర్ శివారులో సుమారు 340 ఎకరాలను సేకరించిందని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలతోపాటు, కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో షాద్ నగర్ నియోజకవర్గానికి వచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు సిద్దాపూర్ భూముల్లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు విన్నవించినట్లు చెప్పుకొచ్చారు. పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యం తప్ప, చదువుకున్న యువతకు కొలువులు లేవని చెప్పడంతో కేటీఆర్ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికి సిద్దాపూర్ భూముల్లో ఐటీ కారిడార్ ఏర్పాటుకు అడుగులు పడేవని అంజయ్య యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎకో పార్క్ ని వెంటనే రద్దు చేయాలని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

CM Rekha Gupta: వర్క్ ఫ్రం హోమ్ ఎత్తివేస్తూ ఢిల్లీ సీఎం ఆదేశాలు
KTR | రేపు కన్నేపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించనున్న కేటీఆర్