హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ దాడులు (IT Raids) మరోసారి కలకలం సృష్టించాయి. నగరంలోని ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట సహా తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్లాండ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు, కుటుంబీకుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెనికేపల్లిలో ఉన్న నీమ్ట్రీ ఫామ్‌హౌస్‌లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.