సిటీబ్యూరో, మే 26 ( నమస్తే తెలంగాణ ) : సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీ ఉద్యోగులు, సైక్లిస్టులు నగరంలో ‘మారథాన్ క్లీన్ అప్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వీకెండ్లో ఓ చెరువును ఎంచుకుని అక్కడ వ్యర్థాలను తొలిగిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కాప్రా లేక్ వద్ద పరిశుభ్రత చేపట్టారు. ఈ సందర్భంగా హ్యాపీ హైదరాబాద్ సభ్యుడు రవి మాట్లాడుతూ.. చెరువుల వద్ద చేపట్టే స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరారు. మన పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.