హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా (Assistant Professor) పనిచేస్తున్న నిఖిల్ మదన్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఢిల్లీకి చెందిన నిఖిల్ మదన్ (37) గచ్చిబౌలిలోని ఐఎస్బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్య ప్రేరణతో కలిసి ఐఎస్బీ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిఖిల్ గత కొంతకాలంగా మానసిక కుంగుబాటుకు చికిత్స తీసకుంటున్నారు. అదే అతని ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.