సిటీబ్యూరో: ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించడంతో వచ్చే నెల 5న జరిగే మరో మ్యాచ్‌కు భారీ డిమాండ్ పెరిగింది.
దీనిని ఆసరగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లంటూ ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని క్లిక్ చేయగానే వెబ్సైట్లలోకి వెళ్తాయి.. అక్కడ ఆన్లైన్ పేమెంట్స్ తీసుకున్నాక.. నకిలీ టికెట్లు విక్రయించేందుకు ఎత్తులు వేస్తున్నారు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్లు పొందవచ్చంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.