నకిలీ ధ్రువీకరణ పత్రాలపై విచారణ షురూ
గాజులరామారంలోని 307 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేలా కాంగ్రెస్ నాయకులు నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులు చేయడంపై జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మేడ్చల్, మే 2 (నమస్తే తెలంగాణ): గాజులరామారంలోని 307 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేలా కాంగ్రెస్ నాయకులు నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులు చేయడంపై జిల్లా కలెక్టర్ మను చౌదరికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు నాయకులు తమకు చెందిన భూమిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి భూ భారతి పోర్టల్‌లో చేసిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. 307 సర్వే నంబర్‌గల ప్రభుత్వ భూమిని ఎస్ఎఫ్ఐకి గతంలోనే కేటాయించారు.
అయితే ఈ సర్వే నంబర్లో ఉన్న భూమి అంతా ప్రభుత్వానికి చెందినదిగా ఉండటమే కాకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. అయినా ఈ భూమిపై అక్రమంగా హక్కులు పొందేలా ప్రయత్నిస్తూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ధ్రువీకరణ పత్రాలు నకిలీవి అని తేలితే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనిఅధికారులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

