సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సౌత్- వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మిపెరుమాళ్ ఆదివారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దరావత్ రవి రైతు. మహారాష్ట్రలో అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇటీవల ఒడిశాలోని ముంచంపుట్ వెళ్లాడు. అక్కడ గంజాయి పండించే గోవింద్ అనే రైతును సంప్రదించి, అతడి వద్ద 100 కిలోల గంజాయి కొనుగోలుచేసి, 32 ప్యాకెట్లలో ప్యాక్ చేయించాడు. స్నేహితులైన మహారాష్ట్రకు చెందిన సయ్యద్ బహదూర్, ఆనంద రాంజీకదమ్ సహకారంతో కారులో లోడ్ చేసి హైదరాబాద్‌కు బయలు దేరారు. విశ్వసనీయ సమాచారంతో హైదరాబాద్‌లోని పారామౌంట్ కాలనీలో ఈ కారును ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కారులో గంజాయి పట్టుబడటంతో ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తదుపరి విచారణను హుమాయున్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
ఆసీఫ్‌నగర్‌కు చెందిన షేక్ పర్వేజ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో హైదరాబాద్, రాజమండ్రి జైలుకు వెళ్లివచ్చాడు. ఈ క్రమంలోనే రాజమండ్రి జైల్లో ఏపీ రావులపాలెం నివాసి, గంజాయి పండించే స్మగ్లర్ దీపక్ పరిచయమయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పర్వేజ్, ఏపీలో ఉన్న దీపక్‌ను సంప్రందించి, ఆర్టీసీ బస్సుల్లో గంజాయి రవాణా చేస్తున్నారు. అతడి స్నేహితుడైన అబ్దుల్ రవూఫ్‌తో కలిసి ఏపీ నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయి వెళ్లే వాహనానికి ఒక కారు, ద్విచక్రవాహనం పైలెట్‌గా వెళ్తుంది. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో షేక్ పర్విజ్, అబ్దుల్వ్రూఫ్ను భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 64 కిలోల గంజాయి, రెండు కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకొని, తదుపరి విచారణ నిమిత్తం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు.
అబిడ్స్, జూన్ 16: అక్రమంగా గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్న ఇంటిని జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ ఇంట్లో నుంచి 8.26 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం.. లోయర్ ధూల్‌పేట్ శివలాల్‌నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అక్రమంగా గంజాయి నిల్వ ఉంచి, విక్రయిస్తున్నట్టు అందిన సమాచారంతో హైదరాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శిరీష నేతృత్వంలో ఎక్పైజ్ పోలీసులు ఆ నివాసంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనంలో 8.26 కిలోల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. దుర్గేశ్సింగ్, అతడి తల్లి అనురాధపై కేసులు నమోదు చేశారు. అనురాధను అదుపులోకి తీసుకోగా, దుర్గేశ్ సింగ్ పరారీలో ఉన్నాడు. తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ కేసును ధూల్‌పేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు మధుబాబు, గోపాల్ దర్యాప్తు చేస్తున్నారు.