International Yoga day | జూబ్లీహిల్స్, మే 28 : అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేటి నుంచి 25 రోజులపాటు యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పీహెచ్సీలలో ఇప్పటికే గర్భిణీ మహిళలకు యోగా తరగతులు నిర్వహిస్తున్న కుటుంబ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. యోగా ప్రాధాన్యతను మరింత పెంచేందుకు మే 28 నుంచి జూన్ 21 వరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పీ హెచ్ సీ లకు వచ్చే రోగులకు మాత్రమే కాకుండా బస్తీలు, కాలనీ లలో స్థానికుల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
యోగాతోనే ఆరోగ్యం : డాక్టర్ బి. విజయ నిర్మల, ఎస్ పీ హెచ్ ఓ, శ్రీరామ్ నగర్ క్లస్టర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పీహెచ్సీలలో 25 రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్లస్టర్‌లోని జూబ్లీహిల్స్, వినాయక్ నగర్, బోరబండ, శ్రీరామ్ నగర్, బంజారాహిల్స్, షౌకత్ నగర్ పీహెచ్‌సీలతోపాటు 18 బస్తీ దవాఖానాలలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తాము.
అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలివే..
1) మే 28 నుంచి జూన్ 1 వరకు..- అవేర్నెస్ క్యాంపైన్ లు, సోషల్ మీడియా ప్రమోషన్స్, కమ్యూనిటీ ఔట్ రీచ్, యోగా ట్రైనర్ ల నియామకం
2) జూన్ 2 నుంచి 6 వరకు..- బేసిక్ యోగ ట్రైనింగ్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్.
3) జూన్ 7 నుంచి 11 వరకు..- ప్రాణాయామం, ధ్యానంపై అవగాహన.
4) జూన్ 12 నుంచి 16 వరకు..- స్వచ్ఛమైన గాలినందించే ఆవరణలో యోగ నిర్వహణకు పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు మొక్కల పెంపకం, పర్యావరణ సమతుల్యత కార్యక్రమాలు.
5) జూన్ 17 నుంచి 20 వరకు..- యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇతర శిక్షణ కార్యక్రమాల పునఃచ్చరణ తరగతులు. 6) జూన్ 21- అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు