చర్లపల్లి, నవంబర్ 5 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఉప్పల్ నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ బొం తు శ్రీదేవి పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి, ముస్లిం బస్తీ , తదితర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ అందించేందుకు ప్రచారంను ము మ్మరం చేస్తున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరించి ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, కనకరాజుగౌడ్, పండాల శివకుమార్‌గౌడ్, జాండ్ల సత్తిరెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, రాజేశ్ వంశరాజ్, కడియాల యాదగిరి, లక్ష్మారెడ్డి, గిరిబాబు, కొమ్ము సురేశ్, కడియాల బాబు, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, ఆనంద్రాజుగౌడ్, మురళి, పాండు, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాల్‌నర్సింహా, సత్తెమ్మ, లలిత, సోమ య్య, ముత్యాలు, రాధకృష్ణ పాల్గొన్నారు.
బండారి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి…
మల్లాపూర్, నవంబర్ 5 : ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా బాధ్యత తీ సుకొని మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్లో ఆదివారం ఆయన కార్పొరేటర్ ప్రభు దాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి బూత్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్, మధు, బీఆర్ఎస్, నాయకులు పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్లో ..
ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్‌నగర్, బీరప్పగడ్డలో ప్రచారం చేశారు.
నాచారంలో మ్యానిఫెస్టోను వివరిస్తూ… ప్రచారం
ఉప్పల్, నవంబర్ 5 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాచారంలో గ్రేటర్ బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి.. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో నేతలు దాసరి కర్ణ, లడ్డు శివ, దత్తు, యాదగిరి, వాసు, తదితరులు పాల్గొన్నారు.
విస్తృతంగా ప్రచారం…
కాప్రా, నవంబర్ 5: కాప్రా డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. సాయిబాబా నగర్, నేతాజీనగర్, హస్తినాపురం, జనప్రియకాలనీ, ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ, హైటెక్కాలనీ, సాకేత్కాలనీ, మనోజ్ ఎన్క్లేవ్, గాంధీనగర్ కాలనీలతోపాటు పరిసర కాలనీల్లో బీఆర్ఎస్ కరపత్రాలు పంపిణీ చేస్తూ గులాబీ కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కలిపించారు. ఈ ప్రచారంలో ఉప్ప ల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోదరుడు బండారి నీలం రెడ్డితో పాటు డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రామంతాపూర్ డివిజన్లో
రామంతాపూర్, నవంబర్ 5 : రామంతాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బుర్ర మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆదివారం ఇంటిం టా ప్రచారం నిర్వహించి, బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ రూపొందించిన మ్యానిఫెస్టోను ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా బుర్ర మహేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.