సిటీబ్యూరో, మార్చి 18(నమస్తే తెలంగాణ) : సీఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఎన్జీఆర్ఐ(NGRI) నిర్వహిస్తోంది. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెషన్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సదస్సుల్లో అనలైటికల్ జియో కెమిస్ట్రీపై విద్యార్థులు, స్కాలర్లకు అవగాహన కల్పించారు. పదిరోజుల సెషన్లో భాగంగా విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణనిచ్చారు. కాగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ తరహా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఎన్జీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి.