సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ) : వ్యర్థాలను సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడంలో టీ హబ్‌కు (T- Hub) ఇన్ఫ్రా కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు(Infra Corporate Excellence Award) వచ్చిందని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. సోమవారం టీ హబ్‌లో ఉద్యోగులతో కలిసి అవార్డు వివరాలను వెల్లడించారు. మేక్సాయిల్, గుడ్డీబ్యాగ్ల సహకారంతో టీ హబ్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను నిర్వహించామన్నారు. కూరగాయల వ్యర్థాలను అధిక పోషక కంపోస్ట్ ఎరువుగా(Nutrient Compost Manure) తయారు చేసినట్లు తెలిపారు.
వాటిని తిరిగి టీ హబ్ ప్రాంగణంలో ఉన్న చెట్లకు వాడామని, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి సైక్లింగ్ చేశామని, ఈ రెండు చర్యలకు గాను ఇన్ఫ్రా కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు దక్కిందని తెలిపారు. ఈ అవార్డు రావడంతోటీ హబ్ ఫెసిలిటీ మేనేజర్ శ్రీనివాస్ తాలుక ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీ హబ్ ఉద్యోగులు పాల్గొన్నారు.