హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు బోల్తా పడింది. దీంతో యువతి మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు. వారంతా ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉద్యోగులు అంతా కలిసి సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ ఓఆర్ఆర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు.
మృతురాలిని సౌమ్యారెడ్డిగా గుర్తించామన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.