Indigo | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 21: జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఎయిర్‌పోర్టు నుంచి మక్కాకు ఇండిగో ఎయిర్‌లైన్స్ నూతన సర్వీస్‌లను శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చడం కోసం విమాన సర్వీస్‌లు ఉపయోగపడుతాయని వివరించారు.
వారంలో సోమ, గురు, శనివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెండు దేశాల మధ్య 5 గంటల 47 నిమిషాలు సమయం పడుతుందని తెలిపారు. అనంతరం ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ మక్క మదీనాకు హైదరాబాద్ నుంచి ఇండిగో తొలివిమాన సర్వీస్‌ను అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటైన మదీనా నగరానికి అనుసంధానించే ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎయిర్‌లైన్స్ అధికారులు పాల్గొన్నారు.