జూబ్లీహిల్స్,నవంబర్12:ఎన్నికలవిధుల్లో అస్వస్థతకు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సత్వరమే వైద్య సహాయం అందడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మలక్‌పేట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మోతీలాల్‌కు గుండెనొప్పి రావడంతో వెంటనే స్పందించి 108లో స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
కుటుంబ సభ్యులు చేరుకుని మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సమయానికి చికిత్స అందడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు.