కాచిగూడ,ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ నిబంధనలకు విరుద్దంగా గుట్టుచప్పుడు కాకుండా మధ్యం బాటిళ్లను విక్రయిస్తున్న వ్యక్తిపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్మిన్ ఎస్సై హెచ్.నరేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నింబోలిఅడ్డా సంఘం హోటల్ ప్రాంతానికి చెందిన రమచంద్రు కుమారుడు గొండబోయిన సత్యం(40)శుక్రవారం గుట్టుచప్పుడు కాచిగూడలోని పలు ప్రాంతాల్లో మద్యం బాటిళ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న అడ్మిన్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని సత్యం నుంచి 40 క్వాటర్స్, 90ml బాటిళ్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Brisk Walking | రోజూ బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Watch: అసెంబ్లీ ప్రాంగణంలోని మంత్రి కారును.. క్రేన్‌తో లాక్కెళ్లిన పోలీసులు
Kishtvar Floods | వరద ఉద్ధృతికి 65కు చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద ఇంకెందరో..!