Illegal Constructions | బంజారాహిల్స్, మే 1: జీహెచ్ఎంసీ సర్కిల్-18 పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. వీటిపై రోజువారీగా అనేకమంది ఫిర్యాదులు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదన్న.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కిల్-18 టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీతో పాటు కొంతమంది సిబ్బంది సహకారంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తీలు, కాలనీలు అనే తేడాలేకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఏదైనా అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే రంగంలోకి దిగే టౌన్‌ప్లానింగ్ అధికారులు నిర్మాణదారుడికి నోటీసు జారీ చేసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపణలు వినినిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులతో చేతులు కలపడం, నోటీసులు ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా సహకరించడం పరిపాటి అయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని కమలాపురి కాలనీ ఫేస్-3లో ఇందిరానగర్ బస్తీలోకి వెళ్తే ప్రధాన రహదారిపై నర్సింగ్ యాదవ్ అనే మద్యం వ్యాపారి సుమారు ఏడాది కాలంగా భారీ వాణిజ్య సముదాయం నిర్మిస్తున్నారు. సుమారు 600 గజాల స్థలంలో సెల్లార్‌తో పాటు ఏడంతుస్తులతో నిర్మిస్తున్న ఈ భవనానికి మిగతా IIవ పేజీలో